టీజర్ డేట్ ఫిక్స్ చేసిన తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్

టీజర్ డేట్ ఫిక్స్ చేసిన తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్

Published on Sep 13, 2019 10:30 PM IST

ఇటీవల నిను వీడని నీడను నేను వంటి హార్రర్ థ్రిల్లర్ మూవీతో మంచి విజయం అందుకున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్. కామెడీ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో సందీప్ కిషన్ హాస్యంతో కూడిన లాయర్ పాత్ర చేయడం విశేషం . కాగా ఈ చిత్ర టీజర్ డేట్ ని చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఈనెల 15న తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హన్సిక మోత్వానీ నటిస్తుండగా, రాధికా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఓ కీలక పాత్ర చేస్తున్నారని సమాచారం. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇది అతనికి 75వ చిత్రం కావడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు