రిలీజ్ డేట్ మార్చుకున్న “గల్లీ రౌడీ”..!

Published on Aug 24, 2021 9:03 pm IST

యంగ్ హీరో సందీప్‌ కిషన్, నేహా శెట్టి హీరోయిన్‌గా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా ‘గల్లీ రౌడీ’. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజర్స్‌, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేస్తామని నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ డేట్ విషయంలో ఇప్పుడు వారు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.

అయితే అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘డియర్ మేఘ’, ‘కార్తీక్స్ ది కిల్లర్’ వంటి చిత్రాలు సెప్టెంబర్ 3వ తేదినే రిలీజ్ అవుతున్నా ‘గల్లీ రౌడీ’ మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ తాజాగా గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా సెప్టెంబర్ 3వ తేదినే రిలీజ్ అవుతున్నట్టు ప్రకటన రావడంతో ‘గల్లీ రౌడీ’ సినిమా విడుదలను నిర్మాతలు పోస్ట్ పోన్ చేశారు. అయితే సెప్టెంబర్ నెలలోనే ‘గల్లీ రౌడీ’ సినిమా విడుదల అవుతుందని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్‌ ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా, కోలివుడ్ యాక్టర్ బాబీ సింహ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :