విడుదలకు సిద్దమైన సందీప్ కిషన్ సినిమా !

జాకీష్రాప్ ప్రధాన పాత్రల్లో సందీప్ కిషన్ హీరోగా సి.వి.కుమార్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందించిన ‘మాయావన్’ సినిమా ఇటివల తమిళ్ లో విడుదలై హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ పేరతో తెలుగులో అనువాదం చేశారు. తాజా సమాచారం మేరకు ఈ మూవీని ఈ నెల 29న విడుదల చెయ్యనున్నారు.

ఆద్యంతం అసక్తి కలిగించే అంశాలతో ఉత్కంఠభరితమైన కథనంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో విజయం సాధిస్తుందేమో చూడాలి. ఎస్‌బికె పిలింస్ పతాకంపై తెలుగులో విడుదల కానున్న ఈ సినిమా పై సందీప్ కిషన్ హోప్స్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మంజుల దర్శకత్వంలో మనసుకు నచ్చింది సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.