క్రేజీ డైరెక్టర్ తో సందీప్ కిషన్.?

sandeep-kishan
వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘టైగర్’ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. అంతే కాకుండా మొదటి షో నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇది కాకుండా సందీప్ కిషన్ ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేసే అవకాశం సందీప్ కిషన్ కి వచ్చినట్లు సమాచారం.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటారా.. స్టార్ హీరోస్ కి సూపర్ హిట్ ఫిల్మ్స్ అందించిన కృష్ణవంశీ డైరెక్షన్ లో సందీప్ కిషన్ సినిమా చేయనున్నాడట. డిఫరెంట్ సినిమాలను కమర్షియల్ గా చెప్పడంలో కృష్ణవంశీ కి మంచి పేరుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి త్వరలోనే నిర్మాతలు అనౌన్స్ చేస్తారు. సందీప్ కిషన్ – కృష్ణవంశీ కలిసి ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.

Exit mobile version