మహేష్ తో సినిమాపై నోరు విప్పిన సందీప్ వంగ !

మహేష్ తో సినిమాపై నోరు విప్పిన సందీప్ వంగ !

Published on Apr 27, 2018 5:01 PM IST


‘అర్జున్ రెడ్డి’తో సంచనలనం సృష్టించి దర్శకుడిగా బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ వంగ తన రెండవ సినిమాను సూపర్ట్ స్టార్ మహేష్ బాబుతో చేస్తారని బలమైన వారాలొచ్చిన సంగతి తెల్సిందే. కానీ మహేష్ తన తర్వాతి సినిమాల్ని వంశీ పైడిపల్లి, సుకుమార్ లతో చేస్తుండటంతో సందీప్ సినిమా ఏమైందనే అనుమానాలు రేకెత్తాయి.

మహేష్ బాబు ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో సందీప్ వంగతో సినిమా ఉంటుందని స్పష్టం చేయగా సందీప్ కూడ మహేష్ బాబుగారితో సినిమా చేస్తానని, ఇప్పటికే కథను ఫైనల్ చేయడం జరిగిందని అన్నారు. దీన్నిబట్టి మహేష్ ప్రస్తుతం సైన్ చేసిన ప్రాజెక్ట్స్ పూర్తవగానే సందీప్ సినిమా చేస్తారని స్పష్టమైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు