పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్‌కు దర్శకుడు చిన్న విరామం ప్రకటించారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తిరిగి మే నెలలో పట్టాలెక్కనుంది. మే నుండి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కించేందుకు సందీప్ వంగా సిద్ధమవుతున్నాడు.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా, తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వివేక్ ఒబేరాయ్, కాంచన వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


