రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో పీరియాడిక్ వార్ చిత్రం ‘ఫౌజీ’లో నటిస్తున్న ప్రభాస్.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో తన సత్తా చాటిన సందీప్ రెడ్డి ఈసారి ప్రభాస్‌ను ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడు.
ఈ చిత్రం విషయంలో సందీప్ రెడ్డి ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఈ చిత్రాన్ని 100 వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడు ఈ డైరెక్టర్. అయితే, ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటుండటంతో ‘స్పిరిట్’ ఆలస్యం అవుతుందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ, ‘స్పిరిట్’ చిత్ర షూటింగ్‌పై సందీప్ రెడ్డి ధీమాగా ఉన్నాడు.
ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసిన ఆయన, తాను అనుకున్న సమయానికే సినిమా షూటింగ్ ముగించేయాలని చూస్తున్నాడు. అంతేగాక, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్‌కు కావాల్సినంత సమయాన్ని కూడా కేటాయించేలా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఇక ‘స్పిరిట్’ మూవీని 2027 మార్చి 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
