‘సందిగ్ధం’ చిత్ర ట్రైలర్ విడుదల.. మే 29న సినిమా రిలీజ్

‘సందిగ్ధం’ చిత్ర ట్రైలర్ విడుదల.. మే 29న సినిమా రిలీజ్

Published on May 24, 2026 5:08 PM IST

Sandigdham Trailer

తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను బృందం విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు పార్థసారధి మాట్లాడుతూ.. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించామని చెప్పారు. భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు హీరో నిహాల్ పేర్కొన్నారు. ఈ సినిమాలో సత్య అనే కీలక పాత్రలో నటించినట్లు అర్జున్ తెలిపారు. తమకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు మిగతా నటీనటులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సినిమాలో ‘తెర చేప’ ఫేమ్ నవీన్ సంకరపు ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి గౌతమ్ రవిరామ్ సంగీతం అందించగా, నందన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా, విశ్వన్ రాజ్. డిఎస్ ఎడిటర్‌గా పనిచేశారు.

Sandigdham Trailer

సంబంధిత సమాచారం

తాజా వార్తలు