త్వరలో మొదలుకానున్న ‘సంఘమిత్ర’ !

11th, January 2018 - 02:37:31 PM

తమిళ దర్శకుడు సుందర్.సి భారీ బడ్జెట్ తో రూపొందించనున్న చిత్రం ‘సంఘమిత్ర’. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లేదా మే నెల నుండి మొదలుపడతామని అన్నారు. 18 నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ జరుపుకున్న ఈ ప్రాజెక్టుకు ముందు గ్రాఫికల్ వర్క్ చేసి ఆ తర్వాత షూటింగ్ మొదలుపెడతామని అన్నారు.

ముందుగా ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ ను అనుకోగా ఆమె తప్పుకోవడంతో దిశా పఠానిని తీసుకునే యోచనలో ఉన్నారు నిర్మాతలు. ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందివ్వనున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పనిచేయనున్నారు. నిర్మాణ సంస్థ శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ ఈ చిత్రం కోసం సుమారు రూ. 450 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయనుంది.