పండ‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..!

Published on Oct 30, 2018 11:01 am IST

భారత ప్ర‌ముఖ టెన్నిస్ స్టార్, హైదరాబాదీ అమ్మాయి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జా- పాకీస్తానీ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్‌ల జంట‌కు పండంటి కొడుకు పుట్టాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సానియా మీర్జా భ‌ర్త షోయ‌బ్ మాలిక్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేశాడు. 2010 ఏప్రిల్ 10న సానియా- షోయ‌బ్‌ల వివాహం అయిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా సానియా పండండి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో ఆ కుంటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి.

ఇక ఈ నేప‌ధ్యంలో తాను తండ్రిని అయ్యానంటూ షోయ‌బ్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. మీ అంద‌రి ఆశీస్సుల‌తో.. బేబీ మీర్జా మాలిక్, సానియా మీర్జా క్షేమంగాఉన్నార‌ని.. అంద‌రికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు షోయ‌బ్. ఇక సానియా మీర్జా ఢిల్లీలోకి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని స‌మాచారం. ఇక సానియా తొలి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో ఆ కుటుంబం ప‌ట్ట‌లేని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విష‌యం పై ప‌లువురు సెల‌బ్ర‌టీలు సానియా-షోయ‌బ్ దంప‌తుల‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముందుగా సానియా ఫ్రెండ్ బాలీవుడ్ డైరెక్ట‌ర్ అండ్ కొరియోగ్రాఫ‌ర్ ఫ‌రా ఖాన్.. కాంగ్రాట్స్ సానియా అండ్ షోయ‌బ్ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపారు.

సంబంధిత సమాచారం :