భారతీయ టెన్నిస్ సంచలనం సానియా మిర్జా జేమ్స్ బాండ్ సినిమాలో నటిస్తుందా? ఆమె తాజా ట్వీట్ లను పరిశీలిస్తే అవుననే చెప్పుకోవాలి. ఈ హాట్ అమ్మడు బాండ్ ఆఫర్ చాలా టెంప్ట్ చేస్తుందని అయితే దాన్ని అంగీకరించాలా లేదా అన్న ఆలోచనలో వున్నానని ట్వీట్ చేసింది
బాండ్ అనేది ఒక వరల్డ్ ఐకాన్. బాండ్ ఆఫర్ ని అంగీకరించే ఆలోచనలో వున్నాను. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతానని జతకలిపింది. ఎదో సరదాకి సానియా ఇదంతా కూడా చేస్తూ వుండచ్చన్నది కొందరి అనుమానం. అయితే మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతానికి మాత్రం బాండ్ గర్ల్ కి కావాల్సిన అన్ని లక్షణాలు ఈమెలో వున్నాయి


