ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాది అమ్మాయి సానియా మీర్జా యాంకర్‌గా మారింది. అందరూ అనుకుంటున్నట్లుగా బాండ్ చిత్రంలో సానియా మీర్జా హీరోయిన్ గా నటించడం లేదు. త్వరలో సోనీ పిక్స్ ఛానల్‌లో ప్రసారం కాబోయే ‘స్కూల్ అఫ్ బాండింగ్’ కార్యక్రమానికి వ్యాఖ్యాత(యాంకర్)గా వ్యవహరించనుంది. నేడు ఈ ప్రోగ్రాం టీజర్ విడుదలయింది. 60 సెకన్ల ఈ ప్రోమోలో తన నటన, ఆహార్యంతో సానియా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
జేమ్స్ బాండ్ చిత్రాలకు సంబందించిన విశేషాలను ఈ కార్యక్రమంలో రివీల్ చేయనున్నారు. వారి స్టైల్ తీరు గురించి చర్చించనున్నారు. ‘ఎలా మొదలుపెట్టాం అనేది ముఖ్యం కాదు, ఎలా ముగించాం అనేది ముఖ్యం’ అంటూ సానియా ఇంగ్లీష్‌లో చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.
‘స్కూల్ అఫ్ బాండింగ్’ – సానియా మీర్జా ప్రోమో చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


