ఆ స్టార్ కి ఊపిరితిత్తుల సమస్య !

ఆ స్టార్ కి ఊపిరితిత్తుల సమస్య !

Published on Aug 10, 2020 12:18 PM IST

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్ నిన్న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ బాలీవుడ్ స్టార్ అభిమానులు ఆందోళన చెందారు. కాగా సంజయ్ దత్ కి శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో నిన్న సాయంత్రం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు.

కాగా సంజయ్ సన్నిహితులలో ఒకరు తాజా ప్రకటన ప్రకారం, సంజయ్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. వైద్యులు సంజయ్ ఊపిరితిత్తుల నుండి నీటిని తీశారు. ప్రస్తుతం డాక్టర్ల పరిశీలనలో ఉన్న ఆయన సోమవారం డిశ్చార్జ్ అవుతారు.
మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సంజయ్ భార్య మన్యత మరియు ఆయన పిల్లలు దుబాయ్ లో ఉంటున్నందున.. ముంబై లోని తన నివాసంలో సంజయ్ ఒంటరిగా ఉంటున్నారు

కాగా ప్రతిష్టాత్మక కెజిఎఫ్ 2 మూవీలో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. అధీరా అనే ప్రధాన విలన్ గా సంజయ్ దత్ పెద్ద జెడ, ముఖంపై టాటూలు కలిగి ఉన్న భయంకరమైన విలన్ గా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు