సంజు 11రోజుల కలక్షన్స్ !

సంజు 11రోజుల కలక్షన్స్ !

Published on Jul 10, 2018 4:41 PM IST

Sanju

బాలీవుడ్ యువ హీరో రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన చిత్రం సంజు . ప్రముఖ హీరో సంజయ్ దత్ జీవిత కథ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇక విడుదలైన మొదటి రోజు నుండే మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటున్న ఈ చిత్రం 11 రోజులకు గాను 275 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకొని రన్బీర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. రాజ్ కుమార్ హిరానీ , విధు వినోద్ చోప్రాలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రహెమాన్ , సంజయ్ వాండేకర్ , అతుల్ రానింగ లు సంగీతం అంధించారు.

తాజా వార్తలు