నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ ‘శంకరాభరణం’

నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ ‘శంకరాభరణం’

Published on Nov 30, 2015 11:51 PM IST

Shankarabharanam-

హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సెకండ్ హ్యాట్రిక్ ని టార్గెట్ చేస్తూ చేసిన సినిమా ‘శంకరాభరణం’. క్రైమ్ కామెడీ జానర్లో, తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని బీహార్ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, నిర్మాణ బాధ్యతలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ కనిపించనుంటే, అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.

బిజినెస్ పరంగా ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పుకోవాలి. రిలీజ్ కి నెల రోజుల ముందే అన్ని ఏరియాల బిజినెస్ తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయి. నిఖిల్ కెరీర్లో ఇప్పటివరకూ రిలీజ్ కాని న్యూజీ ల్యాండ్, ఆస్ట్రేలియా, లండన్ లాంటి ప్రాంతాలలో కూడా రిలీజ్ కానుంది. అలాగే కేవలం ఇరు రాష్ట్రాల్లోనే కలుపుకొని సుమారు 500కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. నిఖిల్, కోన వెంకట్ లు కూడా ఈ సినిమా సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉదయ్ నందనవనం దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు డైరెక్టర్.

తాజా వార్తలు