సంపూ,నభానటేష్ అతిధులుగా సంతోషం అవార్డ్స్‌ కర్టెన్‌రైజర్‌ లోగో ఆవిష్కరణ

santhosam

‘సంతోషం సౌతిండియా 17వ అవార్డుల’ కర్టెన్‌ రైజర్‌ బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. జూబ్లీహిల్స్‌లోని పాస్తా రాస్తాలో జరిగిన ఈ వేడుకకు ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నభా నటేష్‌, బర్నింగ్‌ స్టార్‌ సుంపూర్ణేష్‌ బాబు అథితులుగా విచ్చేశారు. పాపులర్‌ సింగర్‌ సింహా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దక్షిణ భారత సినీ రంగంలో ప్రధానమైన అవార్డుల్లో ‘సంతోషం ఫిలిం అవార్డ్స్‌’ కూడా ఒకటి. ప్రతి ఏటా జరిగే సంతోషం అవార్డ్స్‌ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు. 29న జరగబోయే ఈ అవార్డుల ఫంక్షన్‌కు ముందుగా కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా నబానటేశ్‌.. అవార్డు ఫంక్షన్‌ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సంతోషం 17వ సంత్సరం అవార్డుల్లో నేను పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం నేను పర్ఫామ్‌ కూడా చేస్తున్నాను. సురేష్‌గారికి చాలా చాలా థ్యాంక్స్‌. ఇక్కడకు విచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్‌ అని అన్నారు.

సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ…సంతోషం అవార్డ్స్‌ ద్వారా ఎంతోమంది కళాకారులను ఎంకరేజ్‌ చేస్తూ అవార్డులు ఇస్తున్నటువంటి సురేష్‌ భయ్యాకు చాలా థ్యాంక్స్‌. ఆల్‌ ద బెస్ట్‌ అన్న ఎంతో పెద్ద నటుల దగ్గర నుంచి నాలాంటి ఇంత చిన్న నటుడ్ని కూడా ఎంకరేజ్‌చేస్తున్నటువంటి మీరు ఇంకా చాలా అవార్డు ఫంక్షన్లు చాలా మందికి చాలా సార్లు చేసి వాళ్లందరికీ ఎదుగుదలకు మీరు కారణమై వాళ్ళకు సపోర్ట్‌ ని అందజయ్యాలని కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్‌బాబు అన్నారు.

సమీర్‌ మాట్లాడుతూ… పదిహేడో తారీఖున సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ఇవ్వడం చాలా ఆనందం. అవార్డు అనేది ఒక ఆర్టిస్ట్‌కి ఎంకరేజ్‌మెంట్‌ వంటిది. ఏదన్నా పట్టుకుంటే వదలడు మొండి మనిషి. వర్షం పడుతుంది ఎలాగా అనుకుంటుంటే వర్షం ఆగిపోతుంది అన్నాడు. అలాగే ఆగిపోయంది. ఇలాగే ప్రతి సమయం ఆయనకి కలిసిరావలని కోరుకుంటూ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సురేష్‌కొండేటి చాలా మంచి మనిషి. ఆల్‌ ద బెస్ట్‌ అని అన్నారు.

సురేష్‌ కొండేటి మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత మంచి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. రాంబాబు,గోసాల గోవింద్‌రావ్‌ ‘ఎర్రచీర’ నిర్మాత, దర్శకుడు సుమన్‌బాబు, శ్రీవెంకటేష్‌, సుధాకర్‌ రెడ్డి, రోబోటెక్‌ మారుతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

Exit mobile version