మరో కొత్త సబ్జెక్ట్ తో ‘ప్రేమ్ కుమార్’ గా సంతోష్ శోభన్!

Published on Sep 1, 2021 8:54 am IST

ప్రెజెంట్ టాలీవుడ్ యంగ్ బ్లడ్ అండ్ టాలెంట్ లో యువ హీరో సంతోష్ శోభన్ కూడా ఒకడు. లాస్ట్ చిత్రం “ఏక్ మినీ కథ” తో ఓటిటిలో అయినా మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఆడియెన్స్ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఇక అక్కడ నుంచి మరిన్ని కొత్త సబ్జెక్టు లను హోల్డ్ చేసిన సంతోష్ ఇప్పుడు వాటిలో ఒకదానితో ‘ప్రేమ్ కుమార్’ గా గ్లింప్స్ తో వచ్చాడు. దర్శకుడు అభిషేక్ మహర్షి తెరకెక్కించిన ఈ చిత్రం కూడా ఆసక్తికరంగానే ఉంది.

పైగా ఇందులో సంతోష్ రోల్ కూడా భిన్నంగా హిలేరియస్ గా కనిపిస్తుంది. సినిమాలో తన పేరుకి తగ్గట్టుగానే కొంతమంది అమ్మాయిలతో ప్రేమాయణం పెళ్లి వరకు వెళితే ఓ అమ్మాయి లేచిపోయింది అని వార్త వినడం వంటివి ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఇంకా ఇందులో అనంత్ శ్రీకర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా క్యాచీ గా ఉంది. రాశి సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శివ ప్రసాద్ పన్నీరు నిర్మాణం వహించగా సినిమా రిలీజ్ కూడా త్వరలోనే ఉండనున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :