రవితేజ – సంతోష్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో సినిమా వుంటుందట !

రవితేజ – సంతోష్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో సినిమా వుంటుందట !

Published on Oct 31, 2018 4:00 AM IST

santosh srinivas raviteja
మాస్ మహరాజా రవితేజ , సంతోష్ శ్రీనివాస్ ల కలయికలో ‘తేరి’ రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్నినిర్మించనుంది. అయితే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయినా ఈచిత్రం ఇటీవల ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇక రవితేజ కూడా వి. ఐ ఆనంద్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వార్తలు నిజమేననునుకున్నారు.

కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా విషయంలో మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. రవితేజ -సంతోష్ శ్రీనివాస్ ల చిత్రం డిసెంబర్ లో మొదలయ్యే అవకాశాలు వున్నాయి. ఇక ఈచిత్రం తేరి రీమేకే కాకపోతే అందులోని పాయింట్ ను మాత్రమే తీసుకున్నాం స్టోరీ కంప్లీట్ డిఫ్రెంట్ గా వుంటుందని అన్నారు. ఇక ఈ ఏడాది ‘రంగస్థలం’ తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న మైత్రి వచ్చే నెలలో మరో రెండు చిత్రాలతో ప్రేక్షకులముందుకు రానుంది. దాంట్లో ‘సవ్యసాచి’ నవంబర్ 2న విడుదలవుతుండగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ వచ్చే నెల 16న విడుదలవుతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు