బాహుబలి రైటర్ తో సప్తగిరి సినిమా !

Published on Sep 11, 2019 9:35 am IST


టాలీవుడ్ ప్రముఖ రచయిత బాహుబలి వంటి బ్లాక్ బస్టర్స్ కి కథలచ్చిన విజయేంద్రప్రసాద్ కథ కథనం అందిస్తూ, మరియు తానే స్వయంగా సమర్పిస్తున్న సినిమా కంచిలో మంగళవారం పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో సప్తగిరి హీరోగా నటిస్తుండటం విశేషం. కళ్యాణ్‌ రామ్‌ ‘హరేరామ్‌’ ఫేమ్‌ హర్షవర్థన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రెయిన్‌బో మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శైలేష్‌ వసందాని నిర్మిస్తున్నారు.

కాగా ప్రియాంక అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు.శైలేష్‌ మాట్లాడుతూ–‘‘కామాక్షి అమ్మవారి దీవెనలతో కంచిలో మా సినిమాని లాంఛనంగా ప్రారంభించాం. అక్టోబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, విజయేంద్రప్రసాద్, హర్షవర్థన్, శైలేష్‌తో పాటు యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సంతోష్‌ శానమొని. అయితే విజయేంద్రప్రసాద్ రాజమౌళి చేస్తోన్న అన్ని సినిమాలకు కథల్ని అందిస్తూనే.. ఈ మధ్య బయటి సినిమాలకు కూడ కథల్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More