‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో కూడా సప్తగిరి హైలైట్.!

‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో కూడా సప్తగిరి హైలైట్.!

Published on Oct 28, 2015 7:16 PM IST

sapthagiri
షార్ట్ ఫిల్మ్ మేకర్ మేర్లపాక గాంధీ దర్శకుడుగా మారి యంగ్ హీరో సందీప్ కిషన్ తో చేసిన సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’. చాలా చిన్న సినిమాగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత మేర్లపాక గాంధీ తన రెండవ ప్రయత్నంగా చేసిన సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’. ఇప్పటికే విలక్షణ పాత్రలతో మెప్పించిన యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా కనిపించనుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

మొదటి సినిమాలో సూపర్బ్ కామెడీని తెరపై చూపించిన మేర్లపాక గాంధీ ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో కామెడీని ప్లాన్ చేసుకున్నాడట. అంతే కాకుండా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో సప్తగిరి కామెడీ హైలైట్ అయ్యింది. ఆ సినిమాలో లానీ ఈ సినిమాలో కూడా సప్తగిరి ఓ మెయిన్ రోల్ చేసాడట. ఆ రోల్ కూడా ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుందని సమాచారం. సో ఈ సినిమాలో కూడా గాంధీ సప్తగిరి మేజిక్ ని రిపీట్ చేస్తాడని ఈ చిత్ర టీం చాలా స్ట్రాంగ్ గా నమ్ముతోంది. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించిన ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ – వంశీలు ఈ సినిమాని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు