‘సర్దార్’ షూటింగ్ అప్డేట్స్

‘సర్దార్’ షూటింగ్ అప్డేట్స్

Published on Mar 26, 2016 4:08 PM IST

sarddar
పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పాటల షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో జరుగుతోంది. దాదాపు రెండు పాటలు తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా స్విట్జర్లాండ్ ఇంటర్లేకెన్ లోని రిసార్ట్స్ టౌన్ లో ఓ పాట షూట్ జరుగుతోంది.

ఆ షూట్ లో పవన్ ఈరోజు నుండి పాల్గొననున్నారు. మొత్తం మూడురోజుల పాటు ఈ పాటను చిత్రీకరించిన తరువాత మరొక పాటను షూట్ చేయనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కావొస్తుండటంతో అనుకున్న సమయానికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. పవర్ ఫేమ్ బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తుండగా దేవి శ్రీ సంగీతాన్ని అందించారు.

తాజా వార్తలు