సర్దార్ గబ్బర్ సింగ్ : గోదావరి రీజియన్ కలెక్షన్స్

సర్దార్ గబ్బర్ సింగ్ : గోదావరి రీజియన్ కలెక్షన్స్

Published on Apr 9, 2016 5:55 PM IST

Sardaargabbarsingh-1
గోదావరి జిల్లా వాసులు సినిమాను, సినీ స్టార్స్ ఎంత పిచ్చిగా అభిమానిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాతో మరోసారి ఈ విషయం తేటతెల్లమయ్యింది.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా తొలిరోజు 2.7 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో, 2.2 కోట్లు తూర్పు గోదావరిలో కొల్లగొట్టినట్లు సమాచారం. ’సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా గురించి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు