సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్లో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన చాలా సినిమాలు మొదటి రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ మార్క్ అందుకుంటుంటాయి. అయితే తాజాగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ మాత్రం మొదటి రోజులోనే మిలియన్ డాలర్ మార్కును దాటేసింది.
ప్రీమియర్ల ద్వారా 763,000 డాలర్లను కొల్లగొట్టిన ఈ చిత్రం మొదటి రోజు శనివారం 326,000 డాలర్లను ఖాతాలో వేసుకుని మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు స్టడీగానే కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ మరొక విశేషమేమిటంటే మిలియన్ మార్కును క్రాస్ చేయడం మహేష్ బాబుకి ఇది 10వసారి కావడం.
ఇక ఫుల్ రన్ పూర్తయ్యే నాటికి ఈ చిత్రం మహేష్ కెరీర్లో ఉత్తమమైన వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.


