మహేష్ ఖాతాలో 15 ఇయర్స్ అల్ టైం రికార్డు..!

Published on Apr 2, 2020 12:43 pm IST

సూపర్ స్టార్ మహేష్ మరోమారు తన స్టార్ డమ్ నిరూపించాడు. 15 ఇయర్స్ ఆల్ టైం రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంక్రాంతికి మహేష్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. సరిలేరు నీకెవ్వరు టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో 4వ స్థానం ఆక్రమించింది. కాగా ఈ చిత్రం బుల్లి తెరపై కూడా ప్రభంజనం సృష్టించింది.

ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సన్ నెట్వర్క్స్ ఉగాది కానుకగా గత నెల 25న జెమినీ టీవీ లో ప్రసారం చేశారు. బుల్లితెరపై ఈ చిత్రం 23.4 టీఆర్పీ సాధించి ఆల్ టైం టాప్ లో నిలిచింది. గత 15ఏళ్లలో ఏ చిత్రానికి ఇంత టీఆర్పీ రేట్ రాలేదంటే అతిశయోక్తి కాదు. వందల కోట్లు కొల్లగొట్టిన బాహుబలి 2 టీఆర్పీ 22.7 కాగా అంతకు మించిన టీఆర్పీ రేటింగ్ సరిలేరు నీకెవ్వరు దక్కించుకుంది. ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా, అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More