“సరిపోదా శనివారం” నుండి పవర్ ఫుల్ మేకింగ్ వీడియో రిలీజ్!

“సరిపోదా శనివారం” నుండి పవర్ ఫుల్ మేకింగ్ వీడియో రిలీజ్!

Published on Jul 10, 2024 5:00 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నాచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. అంటే సుందరానికి చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆగస్ట్ 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం నుండి మేకర్స్ సరికొత్త వీడియోను నేడు రిలీజ్ చేయడం జరిగింది.

హీరో నాని ను పూర్తి మాస్ అవతార్ లో చూపిస్తూ, మేకింగ్ వీడియో ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కొన్ని యాక్షన్ సన్నివేశాలకి సంబందించిన కట్స్ ఉన్నాయి. పవర్ ఫుల్ గా ఈ యాక్షన్ మేకింగ్ వీడియో ఉంది. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం మరో 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని మేకర్స్ వీడియోలో వెల్లడించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు