“సర్కారు వారి” మొదటి పాటకు ఆదరగొట్టేస్తున్న థమన్.!

Published on Oct 22, 2021 7:05 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో తెరకెక్కిస్తున్న స్టైలిష్ అండ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా సినిమా షూట్ కంప్లీట్ చేసుకుంటుండగా మరో పక్క ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఫస్ట్ సింగిల్ పై కూడా ఇంట్రెస్టింగ్ ఇన్ఫో బయటకి వస్తుంది. దీనిని స్వయంగా సంగీత దర్శకుడు థమన్ నే తెలియజేస్తున్నాడు.

లేటెస్ట్ గా పెట్టిన ట్యూన్ ని గమనినట్టైతే మహేష్ ఈ సినిమాలో ఎంతైతే స్టైలిష్ గా కనిపిస్తున్నాడో అంతే స్టైలిష్ గా ఈ సినిమా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. పైగా కొత్తగా అదిరే లెవెల్లో కూడా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ ప్రామిసింగ్ గానే ఉంది. ఇక ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. మరి అలాగే ఈ చిత్రాన్ని మహేష్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :