సర్కార్ విడుదలకుముందే కేరళలో అంత రాబట్టింది !

సర్కార్ విడుదలకుముందే కేరళలో అంత రాబట్టింది !

Published on Nov 5, 2018 9:52 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఈచిత్రం విడుదలకు ముందే కేరళలో వసూళ్ల పరంగా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం అక్కడ 402 స్క్రీన్లలో విడుదల కానుంది. మొదటి రోజు ప్రీ బుకింగ్స్ రూపంలో అక్కడ 3కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ చిత్రానికి తమిళ నాడుతో సహా మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో మంచి క్రేజ్ నెలకొంది. పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రం 200కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇక మరో వైపు ఈ చిత్రం రేపు తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంది. ఈ చిత్రంతో విజయ్ తెలుగు లో కూడా మంచి మార్కెట్ ను ఏర్పర్చుకోనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు