సర్కార్ తమిళనాడులో ఎంత రాబట్టిందంటే !

సర్కార్ తమిళనాడులో ఎంత రాబట్టిందంటే !

Published on Nov 17, 2018 4:00 PM IST

ఇళయ దళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం ఈనెల 7న విడుదలై 10 రోజుల తరువాత కూడా తమిళ బాక్సాఫిస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఈచిత్రం ఇప్పటివరకు తమిళ నాడులో 110 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం అక్కడ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. అక్కడ ఈ చిత్రం 80కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ‘2.0’ చిత్రం విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉన్నందున ఆలోగా ఈ చిత్రం ఆ మొత్తాన్ని రాబడుతుందో లేదో చూడాలి.

ఎఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం లో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు