విజయ్ సర్కార్ అప్ డేట్స్ !
Published on Aug 24, 2018 4:22 am IST

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 62వ చిత్రం సర్కార్. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న విడుదలవుతుండగా ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక అక్టోబర్ 2న చెన్నై లో గ్రాండ్ గా జరుగునుంది.

పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తోనిర్మిస్తుంది. ఇక ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.

  • 6
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook