సర్కార్ తెలుగు వర్షన్ విడుదల తేదీ ఖరారు !

Published on Oct 16, 2018 3:58 am IST

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన 62వ చిత్రం ‘సర్కార్’. ఈచిత్రం తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైయింది. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న రెండు భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదలకానుంది.

ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్ర తెలుగు హక్కులను భారీ ధరకు దక్కించుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్లో గ్రాండ్ గా జరుగనుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది.

ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇక విజయ్ -మురుగదాస్ కలయికలో వస్తున్న ఈ మూడవ చిత్రంపై తమిళ్ తోపాటు తెలుగులోను భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More