సర్కార్ స్టోరీ వివాదానికి శుభం కార్డు !

Published on Oct 30, 2018 1:09 pm IST

ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘సర్కార్’ విడుదలకు ముందే వివాదాలు వెంటాడాయి. ‘సర్కార్’ కథ నాదేనంటూ నా కథ ను కాపీ చేశాడని చిత్ర దర్శకుడు మురగదాస్ ఫై మద్రాస్ కోర్టు లో కేసు వేశాడు రచయిత వరుణ్ రాజేంద్రన్. ఇక ఈ విషయంలో రచయితల సంఘం కూడా వరుణ్ కే మద్దతుగా నిలిచింది. దాంతో ఈ చిత్రం విడుదలఫై అనుమానాలు మొదలయ్యాయి.

ఇక ఈ కేసుపై ఈ రోజు కోర్టు తీర్పు వెలువరించాల్సి వుంది. అయితే అంత కన్నా ముందే ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసుకున్నారు. సర్కార్ చిత్ర నిర్మాత అలాగే దర్శకుడు మురుగదాస్ఈ రోజు ఉదయం వరుణ్ రాజేంద్రన్ ను కలిసి టైటిల్ కార్డు లో తన పేరును వేస్తామని హామీ ఇవ్వడంతో ఈ ఇష్యూ సాల్వ్ అయ్యింది. ఈరోజు ఉదయం మద్రాస్ హైకోర్టు ఈ చిత్రం నవంబర్ 6న విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పొలిటికల్ యాక్షన్ డ్రామా గా రానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా , వరలక్ష్మి శరత్ కుమార్ ,రాధా రవి , యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :