తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం విడుదల కోసం సౌత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలలో 3000 స్క్రీన్లలో విడుదల కానుంది. దాంతో ట్రేడ్ వర్గాల చూపు ఈచిత్ర ఓపెనింగ్స్ ఫై పడింది. తమిళ, మలయాళంలో భారీ మార్కెట్ వున్నా విజయ్ ఈ చిత్రంతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ను ఏర్పరుచుకోవాలని బావిస్తున్నాడు.
గతంలో ఏఆర్ మురుగదాస్- విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకి , కత్తి’ చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం ఫై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదలకానుంది.
