సర్కార్ టీజర్ టాక్ : అంచనాలకు తగ్గట్లు గానే వుంది !

సర్కార్ టీజర్ టాక్ : అంచనాలకు తగ్గట్లు గానే వుంది !

Published on Oct 20, 2018 3:58 AM IST

ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం యొక్క తమిళ వెర్షన్ టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలయ్యింది. ఇక టీజర్ చూస్తుంటే ఈచిత్రం పక్క పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్లుగా అనిపిస్తుంది. మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటు ను వినియోగించుకోవడానికి ఇండియా కి వస్తాడు ఆ తరువాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది.

మొత్తానికి ఈ టీజర్ అటు విజయ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. మురుగదాస్ మరో సారి ఇంట్రస్టింగ్ సబ్జెక్టు తో ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ టీజర్ కూడా అతి త్వరలో విడుదలకానుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాదా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న తెలుగు , తమిళ భాషల్లో ప్రేక్షకులముందుకు రానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు