మొత్తానికి ‘సర్కారువారి పాట’ సర్దుకుపోయినట్టే

Published on Apr 13, 2021 8:55 pm IST

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇప్పటికే దుబాయ్ లో ఒక కీలకమైన షెడ్యూల్ పూర్తిచేశారు టీమ్. రెండవ షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లాలనుకుని కుదరక మళ్ళీ దుబాయ్ వైపే మక్కువ చూపారు.

కానీ అది కూడ కుదరకపోవడంతో సర్దుకుపోయి ఇక్కడే చేయాలని డిసైడ్ అయ్యారు. ఈరోజు ఉగాది నుండే షెడ్యూల్ మొదలైంది. మహేష్ బాబు కూడ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సుమారు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుతున్నారట. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :