మహేష్ నుంచి ఈ సాలిడ్ ట్రీట్ ఇక అప్పుడే.!

Published on May 29, 2021 9:02 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న పక్కా మాస్ మసాలా చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ షూట్ ని పూర్తి చేసుకుంది. అయితే మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ మూలాన కాస్త చాలా కాలం విరామం అనంతరం స్టార్ట్ చేసిన రెండో షెడ్యూల్ ని తాత్కాలికంగా నిలిపివేశారు.

మరి ఈ సినిమా నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మే 31న రావాల్సి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా విడుదల చేయడం లేదని కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ పోస్టర్ లేదా అంతకు మించిన సర్ప్రైజ్ ను మహేష్ బర్త్ డే కే రానున్నట్టు తెలుస్తుంది. మరి ఆ సాలిడ్ ట్రీట్ కోసం అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :