“సర్కారు వారి పాట” టీం అప్పటికి టార్గెట్ పెట్టుకున్నారా.?

Published on Apr 16, 2021 8:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే సెట్టయ్యాయి. అయితే మరి ఈ చిత్రం కోవిడ్ వల్ల చాలా ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే.

అలా ప్రస్తుతం రెండో షెడ్యూల్ ను స్టార్ చేసిన చిత్ర యూనిట్ ఈ సినిమాను పరిస్థితులు అన్ని బాగుంటే ఎప్పటికి ముగించాలో టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ వచ్చే జూలై నాటికే కంప్లీట్ షూట్ ను పూర్తి చేసేయాలని చూస్తున్నారట.

ఇక అక్కడ నుంచి నెమ్మదిగా అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెడితే అనుకున్న సమయానికి సినిమాను డెఫినెట్ గా తీసుకురావచ్చని తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని టీం అనుకున్న టైం కి ముగిస్తారో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారితో మహేష్ కలిసి సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :