వాటిని బీట్ చేసే విధంగా “సర్కారు వారి పాట”

Published on Aug 24, 2021 7:01 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో “సర్కారు వారి పాట” అనే ఒక ఒక్కా మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం తో కూడా మహేష్ మరియు థమన్ ల కాంబో మరో సెన్సేషనల్ మ్యూజిక్ ఫెస్ట్ ను అందిస్తుంది అని ఇది వరకే విన్నాం. అయితే ఇప్పుడు ఈ కాంబో పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

మహేష్ థమన్ ల నుంచి వచ్చిన దూకుడు, బిజినెస్ మేన్, సహా ఆగడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ చార్ట్ బస్టర్స్ మరి వీటన్నింటినీ మించి సర్కారు వారి పాట ఆల్బమ్ ఉండనున్నట్టుగా సినీ వర్గాలు నుంచి సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో హక్కులు భారీ ధరకు అమ్మడుపోయాయని టాక్ ఉంది. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎలా ఉండనున్నాయో చూడాలి. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :