అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించున్న “సర్వం తాళమయం”

Published on Jun 16, 2019 9:57 pm IST

జీవీ.ప్రకాశ్‌కుమార్‌ గతంలో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి మనకు తెలిసినదే. ఐతే గత కొద్ది కాలంగా అయన మ్యూజిక్ ని పక్కన పెట్టి, నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఐతే జి వి ప్రకాష్ ‘సర్వం తాళమయం’ అనే ఓ సంగీత ప్రధాన చిత్రం చేశారు. ఈ మూవీకి ప్రకాష్ కి మేనమావ అయిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ తోపాటు నెడుముడి వేణు, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రహకుడు రాజీవ్‌మీనన్‌ దర్శకత్వం వహించారు.

ఐతే ఈ మూవీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. గత శనివారం నుండి షాంఘై వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో “సర్వం తాళమయం” చిత్రం ప్రదర్శించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం, మాస్ ఆడియన్లకు పెద్ద నచ్చకపోయినా, విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. ఈ చిత్రం 22వ షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు మనోరమ విభాగంలో అధికారికపూర్వకంగా ఎంపికైనట్లు చిత్ర వర్గాల సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More