శర్వానంద్ “రణరంగం” టీజర్ ఎప్పుడంటే…!

Published on Jun 28, 2019 1:20 pm IST

హీరో శర్వానంద్ ,కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న మూవీ “రణరంగం”. స్వామి రారా ఫేమ్ దర్శకుడు సుధీర్ వర్మ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వహిస్తున్నారు. పి డి పి ప్రసాద్ సమర్పిస్తుండగా,సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ని రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృదం ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

ఇటీవలే శర్వానంద్ తాను నటిస్తున్న మరొక చిత్రం 96షూటింగ్ సెట్లో భుజానికి బలమైన గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడే మెల్లగా కోలుకుంటున్న శర్వానంద్ త్వరలో రణరంగం మూవీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం కలదు. కళ్యాణి ప్రియదర్శి మరొక హీరోయిన్ గా నటిస్తుండగా,ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More