పవన్ అనుకుంటే శర్వా కూడా ఇలాంటి పనులుచేస్తున్నాడా…!

Published on Jun 2, 2019 7:14 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ విభిన్నమైన జీవన విధానం కలిగివుంటారని ఆయనతో సన్నిహితంగా ఉండే ఎవనిని అడిగినా చెవుతారు. సినిమాలలో డాన్సులు చేసినా,వినోదం పంచినా అది కెమెరా వరకే పరిమితం. నిజ జీవితంలో ఆయన చాలా సింపుల్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఖాళీ సమయాలలో తన ఫామ్ హౌస్ ఉంటూ అక్కడ ఉండే మొక్కలను చూసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ప్రతి సంవత్సరం తన తోటలో పండిన మేలు రకం మామిడి కాయలు నితిన్,త్రివిక్రమ్ లాంటి ఇండస్ట్రీ లోని సన్నిహితులకు ప్రత్యేక అభిమానంతో పంపిస్తుంటారు.

ఇదే పద్దతిని ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ పాటిస్తున్నారు. ఇండస్ట్రీలో తనకు సన్నిహితుడైన ఫిల్మ్ జర్నలిస్ట్ వంశీ శేఖర్ కి ఆయన మామిడి కాయలు పంపారు. శర్వానంద్ పంపిన ఆ కాయలను, ప్యాక్ పై ఆయన రాసిన బెస్ట్ విషెస్ నోట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు వంశీ శేఖర్. పవన్ మొదలెట్టిన సంప్రదాయాన్ని శర్వానంద్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ “96” రీమేక్ తోపాటు, “రణరంగం” అనే మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More