నందమూరి హీరోతో సతీష్ వేగేశ్న !

నందమూరి హీరోతో సతీష్ వేగేశ్న !

Published on May 27, 2019 10:04 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘తుగ్లక్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో కళ్యాణ్ రామ్ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం విరించి వర్మ సినిమా వెనక్కి పోయేలా కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ తన తరువాత సినిమాను సతీష్ వేగేశ్నతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సతీష్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేసాడట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు