
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఛార్మీతో రూపొందించిన తాజా చిత్రం జ్యోతిలక్ష్మి. గత వారం విడుదలైన ఈ లేడీ ఓరియంటడ్ సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ద్వారా ఓ కొత్త నటుడు వెలుగులోకి వచ్చారు. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించినా, జ్యోతిలక్ష్మితో ఒక్కసారే మెయిన్ లీడ్ రోల్‌కు ఎంపికయి అందరి దృష్టిని ఆకర్షించారు.
జ్యోతిలక్ష్మిలో సత్య దేవ్ నటనకు మంచి రెస్పాన్ వచ్చింది. నిలకడైన స్వభావమున్న పాత్రను తన లుక్స్‌తో, నటనతో పూర్తి న్యాయం చేశారు సత్య. ఇప్పటికే పలు అవకాశాలతో బిజీగా ఉన్న సత్యకు, జ్యోతిలక్ష్మి తర్వాత మరిన్ని అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం సత్య, పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ‘క్షణం’ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవికాంత్ పేరేపు దర్శకుడు.

