‘రాజమౌళి ప్రొడ్యుసర్’ తో సతీష్ వేగేశ్న, త్రిష !
Published on Jun 16, 2018 11:09 am IST

‘శతమానం భవతి’ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ సతీష్ వేగేశ్న. ప్రస్తుతం ఆయన, నితిన్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది త్రిష. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతుంది. గత కొంత కాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే కె.ఎల్.నారాయణ, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబును హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించాలనుకున్నారు. రాజమౌళికి మహేష్ కి అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కేలా కనిపించట్లేదు.

ఈ లోపు కె.ఎల్.నారాయణ సతీష్ వేగేశ్న, త్రిష కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ‘శ్రీనివాస కళ్యాణం’ పూర్తవ్వగానే సతీష్ వేగేశ్న త్రిషతో సినిమా మొదలుపెడతారట. ఇప్పటికే త్రిషాకి, సతీష్ కథ కూడా చెప్పారు. ఐతే ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook