’47 డేస్’ తప్పకుండా విజయం సాధిస్తుందట !

’47 డేస్’ తప్పకుండా విజయం సాధిస్తుందట !

Published on Apr 18, 2019 4:37 PM IST

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘’47 డేస్’’. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ఉపశీర్షిక. పూరీ జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ మూవీని టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్ లాంచ్ కార్యక్రమం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్ లాంచ్ చేసి టీంకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అతిథులు, చిత్ర యూనిట్ మాట్లాడుతూః తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ : ఈ సినిమా చూస్తుంటే బాల‌చంద‌ర్ 47 డేస్ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి నా మొగుడు కావాలి సినిమా వాయిదా వేసి మ‌రీ చేసాడు. అలా మా సినిమా హిట్ కి ప‌రోక్షంగా 47 డేస్ కారణం అయ్యింది. ఈ సినిమా కూడా ‘‘నా మొగుడు కావాలి’’ అంత హిట్ కావాలి అని కోరుకుంటున్నాను.

దర్శకుడు బివియ‌స్ ర‌వి మాట్లాడుతూ స‌త్య కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాను. అత‌ని
సినిమాలు చూస్తుంటే ఆర్టిస్ట్ గా అత‌ను ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తునే ఉంటాడు. అని అన్నారు.
దర్శకుడు వెంకటేష్ మ‌హా మాట్లాడుతూ.. ప్ర‌దీప్ నాకు ఇండ‌స్ట్రీలో యాక్ట‌ర్ గా ట్రై చేస్తున్న‌ప్ప‌టి నుండి తెలుసు. విజువ‌ల్స్ తో అద‌ర‌గొట్టాడు. స‌త్య కి ఈసినిమా మంచి విజ‌యం అందిస్తుంద‌ని న‌మ్ముతున్నాను, అని అన్నారు.

ర‌ఘు కుంచె మాట్లాడుతూః ఒక చిన్న ప్ర‌య‌త్నంగా ఈ సినిమా మొద‌లు పెట్టాం. చాలా ఓర్పుతో ఈ సినిమాని ఇక్క‌డి వ‌ర‌కూ తీసుకొచ్చాం. ఒక క్వాలిటీ సినిమా అందించాల‌నే మా ప్ర‌య‌త్నం తో అనుకున్న దానికంటే కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం. మంచి క్వాలిటీ సినిమాని అందించ‌గ‌లిగితే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తానే న‌మ్మ‌కం మాకు ఉంది. అన్నారు

హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ నా కెరియర్ బ్రేక్ ప్ర‌దీప్ తోనే వ‌చ్చింది. ప్ర‌దీప్ చేసే ప‌నిలో చాలా క్లారిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ అంటే నాకు ఇష్టం. సినిమా విష‌యంలో నేను చాలా న‌మ్మ‌కంగా ఉన్నాను. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వింటాను అని అన్నారు

నటీనటులు: సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్ ,సత్య ప్రకాష్,రవివర్మ తదితరులు.
టెక్నీషియన్స్: సినిమాటోగ్రఫీ : జి.కే, సంగీతం : రఘు కుంచే , ఎడిటర్ : ఎస్ఆర్. శేఖర్, నిర్మాతలు: శశిభూషణ్ నాయుడు,రఘు కుంచె ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ, రచన,దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు