క్రిస్మస్ కానుకగా ‘సత్యం వైపు మార్గము’
Published on Dec 16, 2014 12:30 pm IST

sathyam-vaipu-ga
‘కరుణామయుడు’ సినిమా తర్వాత మరోసారి సీనియర్ నటుడు విజయ్ చందర్ జీసస్ పాత్ర పోషించిన సినిమా ‘సత్యం వైపు మార్గము’. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సృష్టిలో మనిషి ఆరాదించే ఏ దేవుడి విషయంలో అంతగా విశ్వాసాన్ని ప్రకటించని ఓ అమ్మాయికి, జీసస్ మహిమలకు మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘటనల నేపధ్యంలో కథ, కథనాలు సాగుతాయని దర్శకుడు కెవిఆర్ మహేంద్ర తెలిపారు.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చింది. నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు నిర్మాత రుపారెడ్డి బసవ తెలిపారు. సూర్య, సంధ్యా జనక్, శివ, రుపారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు జీవన్ థామస్ సంగీతం అందించారు.

 
Like us on Facebook