సవ్యసాచి విడుదల అయ్యేది అప్పుడేనా ?
Published on Feb 18, 2018 6:10 pm IST

‘ప్రేమమ్‌’ తర్వాత నాగచైతన్య, చందు మొండేటి కలిసి చేస్తోన్న సినిమా ‘సవ్యసాచి’రెండు చేతుల్లో సమాన బలం ఉన్నోడిని ‘సవ్య సాచి’ అంటారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. నిధి అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మే 24న ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తో పాటు చైతు మారుతి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉంది. ఈ రెండు చిత్రాల తరువాత చైతు నిన్ను కోరి డైరెక్టర్ శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

 
Like us on Facebook