చందూ మొండేటి దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం సవ్యసాచి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. దాంతో బాక్సాఫిస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంటుంది.
ఇక మొదటి రోజు మంచి కల్లెక్షన్స్ ను రాబట్టిన ఈ చిత్రం తరువాత రెండు రోజులు అదే జోరు ను కొనసాగించలేకపోయింది. దాంతో నాగ చైతన్య కెరీర్ లో ఈ చిత్రం కూడా యావరేజ్ గానే మిగిలిపోనుంది.
తెలంగాణ , ఏపీలలో ఈచిత్రం యొక్క మూడు రోజుల కలెక్షన్ల వివరాలు
| ఏరియా | కలక్షన్స్ |
| నైజాం | 216లక్షలు |
| సీడెడ్ | 110 లక్షలు |
| నెల్లూరు | 28లక్షలు |
| గుంటూరు | 70లక్షలు |
| కృష్ణా | 47 లక్షలు |
| పశ్చిమ గోదావరి | 33 లక్షలు |
| తూర్పు గోదావరి | 34లక్షలు |
| ఉత్తరాంధ్ర | 92 లక్షలు |
| మొత్తం మూడు రోజులకుగాను షేర్ | 6. 30కోట్లు |
