చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా రాబోతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. కాగా కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే భారీ ఎత్తున విడుదల అయింది.
కాగా సింగల్ స్క్రీన్స్ మరియు మల్టీప్లెక్స్ రెండు చోట్ల సవ్యసాచి మార్నింగ్ షోస్ ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. అయితే వారాంతంలో కూడా ఇతర పెద్ద హీరోల సినిమాల విడుదల లేకపోవడం కూడా సవ్యసాచికి కలిసొచ్చే అంశం.
హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ లో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చైతన్య -చందు మెండేటి కలయికలో వచ్చిన ఈ చిత్రం మరి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.


