సవ్యసాచి వెనక్కి వెళ్ళిపోయిందా ?

Published on Jul 6, 2018 5:00 pm IST


యువ హీరో నాగ చైతన్య నటిస్తున్న రెండు చిత్రాలు ఒకే నెలలో వస్తున్నాయని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి . ఈ నేపథ్యంలో ‘సవ్యసాచి’ విడుదల వాయిదా పడినట్లుగా చిత్ర వర్గాల నుండి సమాచారం వస్తుంది. ముందుగా ఈచిత్రం ఈనెలలోనే విడుదలకావల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆగష్టు రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు చిత్ర నిర్మాతలు .

అయితే అదే నెల 31 న చైతు నటిస్తున్న మరొక చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’కూడా రిలీజ్ కానుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయమని కోరారట నాగార్జున. అందుకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అంగీకరించిందట. మరి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదలచేయాలనుకుంటే నాగ్ ,నాని లు నటిస్తున్న’దేవదాస్ ‘చిత్రం కుడా అదే నెలలో విడుదల కానుంది. మరి నాగ్ ఇందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. అయితే ఈ చిత్రానికి సంభందించిన షూటింగ్ ఇంకా 10 రోజులు జరగనుంది. దీని తరువాత చిత్ర విడుదల ఫై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది .

సంబంధిత సమాచారం :