నాగ చైతన్య చేస్తున్న ‘సవ్యసాచి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్యతో కలిసి ‘ప్రేమమ్’ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు మంచి స్థాయిలో నెలకొన్నాయి. హైదరాబాద్ షెడ్యూల్లో చిత్రీకరణ ముగించిన టీమ్ యూఎస్ వెళ్లనుంది.
ఈ అమెరికా షెడ్యూల్ మే 4న మొదలై సుమారు 15 రోజుల పాటు జరగనుంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడ ప్రధానంగా ఉండనున్నాయి. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.
